ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు ప్రారంభించారు. ఎస్ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు ప్రారంభించారు. ఎస్ఈసీపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మంత్రుల ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు స్పీకర్ తమ్మినేని . దీనిలో భాగంగా ఎస్ఈసీపై చర్యల కోసం ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫారసు చేశారు. 

Also Read:నిమ్మగడ్డపై జగన్ ప్రభుత్వం కౌంటర్ అటాక్: సభా హక్కుల నోటీసులిచ్చిన మంత్రులు

కొద్దిరోజుల క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శాసన సభ స్పీకర్‌ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తన పరిధి దాటి తమపై వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు.

ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ నోటీసుల్లో ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్లమెంట్‌లో సభా హక్కుల నోటీసు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి కారణమైంది.

రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకునే అధికారాలు వున్నా .. చివరి అవకాశంగా గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు ఓ లేఖలో నిమ్మగడ్డ తెలిపిన సంగతి తెలిసిందే.