ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: కూన రవికుమార్‌, నిమ్మగడ్డ ఫిర్యాదులపై చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కూన రవికుమార్, మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లపై వచ్చిన ఫిర్యాదులపై కమిటీ చర్చిస్తోంది.

AP Assembly privileges committee meeting begins in Amravati


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం సాగుతోంది.మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ తో పాటు మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లపై వచ్చిన పిర్యాదులపై కమిటీ చర్చిస్తోంది.

also read:ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: కూన రవికుమార్ పై చర్యలకు నిర్ణయం

ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చినా కూడ కూన రవికుమార్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులకు స్పందించలేదు. అయితే తనకు నోటీసులు అందలేదని కూన రవికుమార్ గతంలో ప్రకటించారు. ఈ విషయమై చర్చిస్తున్నారు.గతంలో నోటీసు ఇచ్చిన సమాయానికి తాను అందుబాటులో లేనని తెలిపిన ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు కూన రవికుమార్. తానుహైద్రాబాద్ కు వెళ్లినట్టుగా ఆధారాలు కూడ సమర్పిస్తానని కూన రవి చెప్పారు. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇవ్వాలన్న కూన రవి కోరారు.మరోవైపు ప్రివిలేజ్ కమిటీకి లేఖ రూపంలో సమాధానం ఇచ్చిన నిమ్మగడ్డ


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios