ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే లండన్ నుంచి తిరిగివచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని తాజా పరిస్ధితులు, శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.