అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం, అసెంబ్లీలలో మరో రెండు గేట్లను అధికారులు మూసి వేయించారు. సెక్రటేరియట్ గేట్ 1, అసెంబ్లీ గేట్ 2 లకు అటు.. ఇటు అధికారులు గోడ కట్టిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ గేట్లను మూసివేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

ఇటీవలే అసెంబ్లీ, సచివాలయంలలో మరికొన్ని గేట్లకు కూడా అడ్డంగా శాశ్వతంగా గోడలను నిర్మించారు. అసెంబ్లీ గేట్ 5, సెక్రటేరియట్ ఉత్తర, దక్షణ గేట్‌లకు అధికారులు అడ్డంగా గోడలు కట్టించారు. తాజా నిర్ణయంతో అసెంబ్లీ, సచివాలయంతో కలిపి ఐదు గేట్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి.

అధికారంలోకి వచ్చినవెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో వాస్తు దోషాలను సరిచేయాని జగన్ సర్కార్ నిర్ణయించింది. వాస్తు దోషాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాకపోకలు సాగించే మార్గాన్ని గతంలోనే మార్చేసిన అధికారులు తాజాగా గేట్లను కూడా శాశ్వతంగా మూసివేస్తున్నారు.