కోడెల శివరామ్ చంపుతానని బెదిరించాడు.. టీడీపీ నేత ఫిర్యాదు..

శాసనసభ మాజీ స్పీకర్ దివంగత టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రపాద్ కుమారుడు కోడెల శివరామ్‌ మీద పోలీస్ కేసు నమోదయ్యింది. తన దగ్గర రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్‌ తీసుకుని డబ్బులివ్వడం లేదని టీడీపీ నేత నర్రా రమేష్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. 

another TDP leader lodges police complaint against kodela sivaram over liquor bussiness - bsb

శాసనసభ మాజీ స్పీకర్ దివంగత టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రపాద్ కుమారుడు కోడెల శివరామ్‌ మీద పోలీస్ కేసు నమోదయ్యింది. తన దగ్గర రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్‌ తీసుకుని డబ్బులివ్వడం లేదని టీడీపీ నేత నర్రా రమేష్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. 

రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపరాం చేసేవాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తన తండ్రి కోడెల శివప్రసాద్ తరఫున మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నగదు చెల్లించమని అడిగితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు.  నర్రా రమేష్ రాజుపాలెం మండలం గణపవరంకు చెందిన టీడీపీ నేత. కాగా రమేష్ ఫిర్యాదుపై శివరాం స్పందించాల్సి ఉంది. 

శివరాంపై ఈ ఆరోపణలు కొత్తకాదు.. గతంలో కూడా ఆయనతో పాటూ ఆయన సోదరిపై చాలా ఆరోపణలు వచ్చాయి. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని కేసులున్నాయి. కొంతమంది వారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం, ఇప్పుడు లిక్కర్ వ్యాపారి శివరాంపై ఫిర్యాదు చేయడం, అది కూడా సొంత పార్టీ నేత కావడంతో ఈ అంశం చర్చనీయంగా మారింది.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios