అన్నా క్యాంటీన్ కూర పాత్రలు తీసుకెళ్లిన పోలీసులు.. తెనాలిలో ఉద్రిక్తత...
గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ పోటాపోటిగా క్యాంటీన్ ను ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్ల తెనాలి లో పోలీసు పక్ష పాతం చూపిస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ ముందు వైసిపి వారితో పోలీసులు అన్నదానం పెట్టించారని అంటున్నారు. పురవేదిక వద్ద పేదలకు టిడిపి నేతలు అన్నం పెడుతున్నారు. అయితే పేదలు వైసిపి అన్నదానం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. టిడిపి అన్నం దానం వద్ద భోజనం చేస్తున్నపేదలకు పెట్టాల్సిన టిడిపి అహార పదార్థాలను, కక్ష్య పూరితంగా పోలీసులు లాక్కెళ్లారని ఆరోపిస్తున్నారు. అన్నదానం చేస్తున్న టిడిపి వర్గీయులపై పోలీసులు దాడి చేశారు. దీంతో టిడిపి - పోలీసుల మద్య తీవ్ర వగ్వివాదం, తోపులాటలు జరిగాయి. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టిడిపి ఆందోళన చేపట్టింది.
కాగా, గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్యాంటీన్ తీసేయాలని మున్సిపల్ అధికారులు నోటీసు ఇచ్చారు. క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఉద్రిక్తతల మధ్యే తెలుగుదేశం నేతలు అన్న క్యాంటీన్ దగ్గర భోజనాలు పంపిణీ చేస్తున్నారు. పోలీసులు కూరల పాత్రలను అడ్డుకున్నారు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా పేదలకు అన్నం పెడుతున్నారు. తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు.
వార్నీ... ఎంత మాయచేశాడు..పెళ్లి పేరుతో ఘరానా మోసం.. యువతి నుంచి రూ. 48లక్షలు వసూలు...
అన్నా క్యాంటీన్ ను తొలగించాలని అధికారులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు అయితే ఈ నిర్ణయం సరికాదని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.ఇవాళ ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన పోలీసులు క్యాంటీన్ కు ఆహారం తెచ్చే వాహనాన్ని మధ్యలోనే ఆపేశారు. వాహనంలోని కూర పాత్రలను పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగారు. కూరలు లేకుండానే ఆహారాన్ని టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలోతెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గరికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
అన్నా క్యాంటీన్ కు పోటీగా ఇక్కడే వైసీపీ నేతలు కూడా ఐదు రోజుల క్రితం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం వైసిపి టెంట్ ఉన్న అధికారులు తొలగించారు. ఇవాళ కూడా అక్కడే ఆహారం పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు చెప్పడంతో.. ఆందోళనలు జరుగుతాయని అనుమానంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో మార్కెట్ సెంటర్ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. షాపులను కూడా బలవంతంగా మూసివేయించారు. చిరు వ్యాపారులపైన ఆంక్షలు విధించారు. మార్కెట్కు వచ్చే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.