అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేఠ  శుక్రవారం నాడు ఉద్యోగ విరమణ చేయనున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనిల్ పునేఠ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఎన్నికల సమయంలో  అనిల్ పునేఠ స్థానంలో  ఎల్వీ సుబ్రమణ్యాన్ని నియమిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. దీంతో అనిల్ పునేఠను ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అనిల్ పునేఠ 1984 బ్యాచ్‌కు చెందినవాడు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్ గా కొనసాగే అవకాశం ఉంది.

చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ విజయం సాధిస్తే అనిల్ పునేఠకు కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అనిల్ పునేఠ  అనివార్యంగా రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి.