AP ZPTC MPTC Election Results: ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు..
ఆంధ్రప్రదేశ్‌లో 10 జెడ్పీటీసీ (ZPTC), 123 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 10 జెడ్పీటీసీ (ZPTC), 123 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలు (ap parishad elections) నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం మంగళవారం పోలింగ్ జరిపింది.మొత్లం.. 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పోలింగ్ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం అయ్యాయి.. అయితే మరో 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.. దీంతో మిగిలిన 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
పోలింగ్ జరిగిన స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది10.30 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్యర్థులు పోటీ పడుతుండగా, 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 13 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 09 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖపట్నంలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 06 ఎంపీటీసీ స్థానాలకు, తూర్ప గోదావరిలో 20 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరిలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 14 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 3 జెడ్పీటీసీ స్థానాలకు, 7 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరులో 1 జెడ్పీటీసీ స్థానానికి, 11 ఎంపీటీసీ స్థానాలకు, ప్రకాశంలో 7 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరులో 4 ఎంపీటీసీ స్థానాలకు, చిత్తూరులో 1 జెడ్పీటీసీ స్థానానికి, 8 ఎంపీటీసీ స్థానాలకు, కడపలో 1 ఎంపీటీసీ స్థానానికి, కర్నూలులో 1 జెడ్పీటీసీ స్థానానికి, 7 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురంలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 16 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.