Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ సెకండ్.. లాస్ట్‌లో యూపీ, బిహార్‌లు

ఇండియన్ పోలీసు ఫౌండేషన్ విడుదల చేసిన స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌లో తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నిలిచాయి. కాగా, చివరి రెండు స్థానాల్లో అంటే 28వ, 29వ స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు ఉన్నాయి. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌ను 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేసి ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2014లో గువహతిలో నిర్వహించిన సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడారు.
 

andhra pradesh tops in smart policing index
Author
Amaravati, First Published Nov 20, 2021, 2:32 PM IST

న్యూఢిల్లీ: స్మార్ట్ పోలీసింగ్ జాబితాలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తొలి స్థానాన్ని(First Place) కైవసం చేసుకుంది. కాగా, తెలంగాణ(Telangana) రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, బిహార్‌లో చివరి స్థానాల్లో ఉన్నాయి. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ ఈ స్మార్ట్ పోలీసింగ్(SMART Policing) ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌ను సర్వే ఆధారంగా రూపొందించారు. మొత్తం పది పాయింట్లతో ఈ లిస్ట్ తయారు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 8.11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, 8.10 పాయింట్లతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది.

పాలసీ అడ్వకసీ వేదిక అయిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఐపీఎఫ్ స్మార్ట్ పోలీసింగ్ సర్వే 2021ను నిర్వహించింది. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రిపోర్టును ప్రచురించాయి. ఈ సర్వేలో ఐఐటీ కాన్పూర్, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్)కు చెందిన నిపుణుల పాలుపంచుకున్నారు. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌ అనేది ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల నుంచే రూపుదాల్చినట్టు చెబుతుంటారు.

Also Read: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా.. ఐదు అవార్డులు గెలుచుకున్నాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

2014లో గువహతిలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర పోలీసు సంస్థల ప్రతినిదులతో నిర్వహించిన ఓ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్మార్ట్ పోలీసింగ్ ఐడియాపై చర్చించారు. ఆయన స్మార్ట్ పోలీసింగ్‌ గురించిన ఐడియాను తెలియజేసి దాని తీరు తెన్నులు ఇలా ఉండాలని వివరించారు. భారత పోలీసులు ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా.. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఆయన భావించారు. అంతేకాదు, మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని సేవలను మరింత వేగవంతం చేయాలని, మరింత సమర్థంగా నిర్వహించాలని కోరారు. ఈ స్మార్ట్ పోలీసింగ్ విధానంలోనే స్ట్రిక్ట్, సెన్సిటివ్, మాడ్రన్, మొబైల్, అలర్ట్, అకౌంటేబుల్, రెస్పాన్సివ్, రిలయబుల్ వంటి లక్షణాలను భారత పోలీసులు కలిగి ఉండాలని ఆశించారు.

ఈ సర్వే ప్రజల వైపు నుంచి నిర్వహిస్తారు. పోలీసుల నడత, పోలీసులు సమర్థత, సేవలు, జాగరూకత, అందుబాటులో ఉండటం వంటి అంశాలపై ప్రజల నుంచే పోలీసులపై సర్వే నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా పోలీసుల సమర్థతకు సంబంధించి ఆరు పాయింట్లు, వారు పాటించే విలువకు మూడు పాయింట్లు, ప్రజల విశ్వాసంపై ఒక పాయింట్లతో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలతో మొత్తం పదిపాయింట్లను రూపొందిస్తారు. అత్యధిక పాయింట్లు వచ్చిన రాష్ట్ర పోలీసులు స్మార్ట్ పోలీసింగ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్టుగా తేలుస్తారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్‌పై అసత్య ఆరోపణలు: రేవంత్ రెడ్డికి డీజీపీ కౌంటర్

తాజా స్మార్ట్ పోలీసింగ్ జాబితాలో తొలి రెండు స్థానాలను వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కైవసం చేసుకున్నాయి. మిగతా రాష్ట్రాల స్థానాలు ఇలా ఉన్నాయి.

అసోం (7.89), కేరళ (7.53), సిక్కిం (7.18), మిజోరం (7.14), గుజరాత్ (7.04), ఒడిశా (6.94), హిమాచల్ ప్రదేశ్ (6.91), పుదుచ్చేరి (6.91), గోవా (6.86), ఢిల్లీ (6.85), తమిళ నాడు (6.73), కర్ణాటక (6.69), ఉత్తరాఖండ్ (6.69), పశ్చిమ బెంగాల్ (6.66), మేఘాలయ (6.60), హర్యానా (6.39), త్రిపుర (6.33), జమ్ము కశ్మీర్ (6.26), మహారాష్ట్ర (6.25)లు వరుసగా ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఉత్తర ప్రదేశ్ 5.81 పాయింట్లతో 28వ స్థానంలో ఉండగా, బిహార్ 5.74 పాయింట్లతో చివరి స్థానంలో ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios