నెల్లూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,30,849కి చేరిక


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 864 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 20,30,849కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృత్యువాతపడ్డారు.గడిచిన 24 గంటల్లో 1310 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు

Andhra pradesh reports 864 new corona cases last 24 hours

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో38,746 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 864 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,30,849కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,010 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1310 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 02వేల 187 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,652 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,73,63,641 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో007,చిత్తూరులో 101, తూర్పుగోదావరిలో135,గుంటూరులో091,కడపలో 117, కృష్ణాలో052, కర్నూల్ లో000, నెల్లూరులో141, ప్రకాశంలో 114,విశాఖపట్టణంలో 052,శ్రీకాకుళంలో034, విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 017 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  12 మంది చనిపోయారు.చిత్తూరులో నలుగురు,  కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరి చొప్పున కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,010కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,397, మరణాలు 1092
చిత్తూరు-2,40,796, మరణాలు1876
తూర్పుగోదావరి-2,87,967, మరణాలు 1270
గుంటూరు -1,74,079,మరణాలు 1191
కడప -1,13,767, మరణాలు 635
కృష్ణా -1,15,423,మరణాలు 1345
కర్నూల్ - 1,23,943,మరణాలు 850
నెల్లూరు -1,42,659,మరణాలు 1026
ప్రకాశం -1,35,146, మరణాలు 1072
శ్రీకాకుళం-1,22,438, మరణాలు 781
విశాఖపట్టణం -1,55,822, మరణాలు 1110
విజయనగరం -82,611, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,75,906, మరణాలు 1093

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios