ఏపీలో కరోనా మృత్యు ఘంటికలు: మొత్తం కేసులు 2 లక్షల 35 వేలకు పైనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7665 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 2,35,525కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 7665 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 2,35,525కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో అనంతపురంలో 631, చిత్తూరులో479, తూర్పుగోదావరిలో1235, గుంటూరులో 621, కడపలో439, కృష్ణాలో146, కర్నూల్ లో883, నెల్లూరులో511కేసులునమోదయ్యాయి.
ప్రకాశం జిల్లాలో 450, శ్రీకాకుళంలో 354, విశాఖపట్టణంలో 620, విజయనగరంలో 574, పశ్చిమగోదావరిలో 722 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కరోనాతో 80 మంది మరణించారు. ప్రకాశంలో 11 మంది, గుంటూరులో 10 మంది, పశ్చిమగోదావరిలో 9మంది, కడప, శ్రీకాకుళంలలో ఏడుగురు, చిత్తూరు, కర్నూల్ జిల్లాల్లో ఆరుగురు,, అనంతపురం,నెల్లూరు, విశాఖపట్టణం, విజయనగరంజిల్లాల్లో ఐదుగురేసి చొప్పున మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు చనిపోయినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసులు, మరణాలు
అనంతపురం-24,738, మరణాలు 175
చిత్తూరు -17,576, మరణాలు 177
తూర్పుగోదావరి-32,938, మరణాలు 228
గుంటూరు-22,339, మరణాలు 233
కడప-13,876, మరణాలు 78
కృష్ణా -10,438, మరణాలు 212
కర్నూల్ -28,314, మరణాలు 251
నెల్లూరు -13,731, మరణాలు 100
ప్రకాశం -8985, మరణాలు 122
శ్రీకాకుళం -11,333, మరణాలు 129
విశాఖపట్టణం -20,013, మరణాలు168
విజయనగరం -9380, మరణాలు 88
పశ్చిమగోదావరి -18,869, మరణాలు 155