ఒకే రోజులో అత్యధికం: ఏపీలో 7,961కి చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 7961కి చేరుకొన్నాయి. 24 గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో నలుగురు మరణించారు. ఒకే రోజులో అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 465 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 7961కి చేరుకొన్నాయి. 24 గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో నలుగురు మరణించారు. ఒకే రోజులో అత్యధిక కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో కరోనా సోకిన వారు 376 మంది.విదేశాల నుండి వచ్చినవారు 19 మంది, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు 70 మంది ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకటించింది.
24 గంటల వ్యవధిలో 82 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ తో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒక్కరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
also read:తమిళనాడు మంత్రి అంబగజన్‌కి కరోనా: ఆసుపత్రిలో చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 3065 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 3089 చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 96 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.
విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినవారిలో 308 మందికి కరోనా సోకింది. వీరిలో 261 యాక్టివ్ కేసులున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 1423 మందికి కరోనా సోకింది. వీరిలో 630 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో ఇవాళ 51 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ తెలిపింది.