ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 462 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 9,834కి చేరుకొన్నాయి. 


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ 462 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 9,834కి చేరుకొన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత 24 గంటల్లో రాష్ట్రంలోని 20,639 శాంపిల్స్ ను పరీక్షించారు. వీరిలో 467కి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక్క రోజులో ఎనిమిది మంది మరణించారు. మరో వైపు 129 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

also read:ఒకే రోజులో ఐదుగురు మృతి: ఏపీలో 9327కి చేరుకొన్న కరోనా కేసులు

Scroll to load tweet…

గత 24 గంటల్లో విదేశాల నుండి వచ్చినవారిలో 15 మందికి కరోనా సోకింది. విదేశాల నుండి వచ్చినవారికి 40 మందికి కరోనా సోకింది.రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో1407 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లాలో 1096 కేసులు రికార్డయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు 4592 మంది కరోనా సోకి కోలుకొన్నారు. అంతేకాదు 5123 యాక్టివ్ కేసులుగా ఉన్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనాతో 119 మంది మరణించారు.