ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 295 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 84వేల 171 కి చేరుకొన్నాయి. 


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 295 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 84వేల 171 కి చేరుకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లోరాష్ట్రంలో కృష్ణా జిల్లా కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,126 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,21,64,531 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 59,410 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0232 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 74 వేల 223 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 3,070 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


గత 24 గంటల్లో అనంతపురంలో 030,చిత్తూరులో 039,తూర్పుగోదావరిలో 032, గుంటూరులో 035, కడపలో 010, కృష్ణాలో 045, కర్నూల్ లో 012, నెల్లూరులో 024, ప్రకాశంలో 012, శ్రీకాకుళంలో 009, విశాఖపట్టణంలో 022, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 021 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,453, మరణాలు 597
చిత్తూరు -86,486,మరణాలు 845
తూర్పుగోదావరి -1,23,877, మరణాలు 636
గుంటూరు -75,009, మరణాలు 667
కడప -55,079, మరణాలు 461
కృష్ణా -48,064,మరణాలు 669
కర్నూల్ -60,626, మరణాలు 487
నెల్లూరు -62,181, మరణాలు 506
ప్రకాశం -62,069, మరణాలు 580
శ్రీకాకుళం -46,002,మరణాలు 347
విశాఖపట్టణం -59,361, మరణాలు 554
విజయనగరం -41,061, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,008,మరణాలు 539