ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు: 24 గంటల్లో 96 మంది మృతి
:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 12,994 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 96 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 15లక్షల93 వేల 821కి చేరుకొన్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి.
:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 12,994 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 96 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 15లక్షల93 వేల 821కి చేరుకొన్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి.గత 24 గంటల్లో అనంతపురంలో 1047, చిత్తూరులో 1600, తూర్పుగోదావరిలో2652, గుంటూరులో670, కడపలో874 కృష్ణాలో274, కర్నూల్ లో856, నెల్లూరులో 503, ప్రకాశంలో 703, శ్రీకాకుళంలో 864, విశాఖపట్టణం1690 ,విజయనగరంలో 535, పశ్చిమగోదావరిలో 746 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో96 మంది కరోనాతో మరణించారు.చిత్తూరులో 14 మంది, కర్నూల్, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున చనిపోయారు. అనంతపురంలో 9మంది, తూర్పుగోదావరి,విశాఖపట్టణం జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనాతో మరణించారు.గుంటూరు,కృష్ణా, నెల్లూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో నలుగురు., ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 10,222కి చేరుకొంది.
గత 24 గంటల్లో కరోనా నుండి 18,373 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,79,637 మంది కరోనా నుండి కోలుకొన్నారు.రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,835 మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,994 మందికి కరోనాగా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,86,76,222 మంది శాంపిల్స్ పరీక్షించారు.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,29,741, మరణాలు 851
చిత్తూరు-1,76,630, మరణాలు 1195
తూర్పుగోదావరి-208508, మరణాలు 911
గుంటూరు -1,43,700, మరణాలు 905
కడప -90,410, మరణాలు 534
కృష్ణా -83,697, మరణాలు 930
కర్నూల్ -1,08,834, మరణాలు 689
నెల్లూరు -1,12,288, మరణాలు 768
ప్రకాశం -1,01,085, మరణాలు 751
శ్రీకాకుళం-1,03,690, మరణాలు 531
విశాఖపట్టణం -1,28,344 మరణాలు 874
విజయనగరం -71,012, మరణాలు 508
పశ్చిమగోదావరి-1,32,987, మరణాలు 775