Asianet News TeluguAsianet News Telugu

ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మళ్లీ నెంబర్ వన్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గురువారం టాప్ 7 రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్రం వెల్లడించింది. 

andhra pradesh placed top in ease of doing business ranking
Author
New Delhi, First Published Jun 30, 2022, 2:19 PM IST

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో (ease of doing business) మళ్లీ ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) నెంబర్ వన్ గా నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో (business reform action plan) టాప్ లో నిలిచింది ఏపీ. టాప్ 7 రాష్ట్రాలను కేంద్రం ప్రకటించగా.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. టాప్ యచివర్సలో ఏపీతో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, తెలంగాణ , పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా వున్నాయి. నాలుగు కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది భారత ప్రభుత్వం. 

ఇకపోతే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో కొత్తగా ఒక వ్యాపారం స్థాపించేందుకు ఉన్న అనుకూల వాతావరణం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూత్రానికి విశేష స్పందన రావడంతో మనదేశం కూడా దీనిపై దృష్టి సారించింది. అదే సమయంలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ అంశంలో పోటీ నిర్వహించి ర్యాంకింగ్ ఇస్తూ వస్తోంది. దీంతో అటు రాష్ట్రాల్లోనూ ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు తొలి నుంచి ముందు వరుసలో ఉంటున్నాయి
 

Follow Us:
Download App:
  • android
  • ios