Andhra pradesh municipal elections: ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో ఖాళీ అయిన మున్సిపల్ పోస్టులకు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి (టీడీపీ, బీజేపీ,జనసేన)లదే పైచేయి అయింది.
andhra pradesh municipal elections: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్లు పొలిటికల్ హీట్ ను పెంచాయి. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఏపీలో మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) జోరు చూపించింది.
నెల్లూరు, తిరుపతి కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్‌లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అలాగే, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. కాకినాడ జిల్లా తుని, ఏలూరు జిల్లా నూజివీడు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు నెలూర్లు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగాయి.
అధికార కూటమిదే పైచేయి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీ అయిన 12 మున్సిపల్ పోస్టులకు సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కూటమి (టీడీపీ, బీజేపీ,జనసేన)లదే పైచేయి అయింది. ఈ 12 పోస్టులలో సోమవారం వరకు 7 స్థానాల్ని అధికార కూటమి దక్కించుకుంది. మిగిలిన ప్రాంతాల్లో కోరం లేకపోవడంతో పాటు పలు ఉద్రిక్తల కారణంగా ఎన్నికలు పడింది. మంగళవారం రోజు ఇక్కడ ఎన్నికలు జరిగాయి.
శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్థానం అధికార కూటమి దక్కించుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్‌ఛైర్‌పర్సన్ పదవులు కూడా అధికార కూటమి గెలుచుకుంది. అలాగే, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఏలూరు నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలు కూడా అధికార కూటమికే దక్కాయి.

నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కృష్ణకుమారి
ఊహించని ట్విస్టుల మధ్య నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. సోమవారం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేసినేని మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థి కాకుండా మండవ కృష్ణకుమారి పేరును అధిష్టానం సూచించింది.
Union Budget 2025: బడ్జెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ కు నిర్మలమ్మ కేటాయింపులు ఇవే
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా మునికృష్ణ
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా అధికార కూటమి అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు . హోరాహోరీ పోటీలో ఆయనకు 26 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లు వచ్చాయి. డిప్యూటీ మేయర్ ఎన్నిక మొదట సోమవారం జరగాల్సి ఉండగా, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లలో తిరుపతి జన సేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుతో సహా 22 మంది మాత్రమే ఓటు వేయడానికి హాజరయ్యారు. ఎన్నిక కొనసాగాలంటే కనీసం 25 మంది సభ్యులు హాజరు కావాల్సిన అవసరం ఉన్నందున, అధికారులు ప్రక్రియను వాయిదా వేశారు.
హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ గా రమేశ్‌కుమార్
హిందూపురం స్థానం కూడా అధికార కూటమే దక్కించుకుంది. హిందూపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి డి.రమేశ్‌కుమార్ ఎన్నికయ్యారు. వైకాపా బలపరిచిన లక్ష్మిపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా, ఛైర్‌పర్సన్ ఇంద్రజ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల జరిగింది.
ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా సయ్యద్ తహసీన్ ఎన్నికయ్యారు.
నూజివీడులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైకాపాకు షాక్ తగిలింది. అక్కడ అధికార కూటమి గెలిచింది. పెద్ద ట్విస్ట్ ఎమిటంటే వైకాపాకు చెందిన 10 మంది కౌన్సిలర్లు అధికార కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో సునాయాసంగా గెలిచే స్థానాన్ని వైకాపా కోల్పోయింది.
Union Budget 2025: బడ్జెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ కు నిర్మలమ్మ కేటాయింపులు ఇవే
