ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి ఎన్నికల హీట్ మొదలయ్యింది. స్థానికసంస్థల ఎన్నికలకు సిద్దమైన ఈసి షెడ్యూల్ విడుదల చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ముందస్తుగానే వీటిని నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించగా అందుకు అంగీకరించిన ఈసి ఎలక్షన్స్ కి సంబంధించిన కీలక సమాచారం ప్రకటించింది... ఈ మేరకు ఏపీ ఎలక్షన్ కమీషనర్ నీలం సాహ్ని పేరిట అధికారిక ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం పంచాయితీరాజ్ పదవీకాలం వచ్చేఏడాది ఏప్రిల్ తో ముగియనుంది... మున్సిపాలిటీలు, మున్సినల్ కార్పోరేషన్లు, నగర పంచాయితీల పదవీకాలం మార్చిలో ముగియనుంది. అయితే ముందుస్తుగానే అంటే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందకు ఈసి సిద్దమయ్యింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఈసి ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఈసి లేఖ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ వివరాలు :
అక్టోబర్ 15, 2025 లోపు పునర్విభజన, రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి.
అక్టోబర్ 16, 2025 నుండి నవంబర్ 15, 2025 లోగా వార్డుల వారిగా ఓటర్ల జాబితా సిద్దం చేసి ప్రచురించాలి.
నవంబర్ 1, 2025 నుండి నవంబర్ 15, 2025 వరకు ఎన్నికల అధికారులు నియామకం
నవంబర్ 16, 2025 నుండి నవంబర్ 30, 2025 వరకు పోలింగ్ కేంద్రాలు ఖరారు.
డిసెంబర్ 1, 2025 నుండి డిసెంబర్ 15, 2025 లోపు రిజర్వేషన్లు ఖరారు
డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో ఈసి సమవేశాలు
జనవరి 2026 లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
