ఇందుకోసం స్వయంగా జిల్లా ఎస్పీ పేరునే వాడుకున్నాడు. అయితే సదరు అధికారి వ్యవహారం బట్టబయలైంది. అతను విధులు నిర్వర్తిస్తున్న స్టేషన్ లోనే కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు
సీఐ హోదాలో ఉన్న వ్యక్తి.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ.. తమ ప్రాంతంలో నేరాలకు కల్లె వేయాల్సింది పోయి.. తానే నేరాలకు పాల్పడ్డాడు. అతి పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఇందుకోసం స్వయంగా జిల్లా ఎస్పీ పేరునే వాడుకున్నాడు. అయితే సదరు అధికారి వ్యవహారం బట్టబయలైంది. అతను విధులు నిర్వర్తిస్తున్న స్టేషన్ లోనే కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు
పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ బస్సులో బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ. 75 లక్షలను గుర్తించారు. డబ్బుతో పాటు ఆ వ్యక్తిని కర్నూల్ తాలూకా అర్బన్ పోలీసులకు అప్పగించారు సెబ్ అధికారులు. అయితే డబ్బుకు సంబంధించిన పత్రాలను చూపించాడు బాలకృష్ణ. అయితే సీఐ కంబగిరి రాముడు పట్టుబడిన మొత్తం సోమ్ము ఇవ్వకుండా రూ. 15 లక్షలను తీసుకున్నాడు.
ఈ డబ్బులను జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ బకాయించాడు సీఐ రాముడు. ఇందులో రూ. 5 లక్షలను ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చాడు. రూ10లక్షలు తన వద్దే ఉంచుకున్నాడు. మిగిలినవి బాలకృష్ణకు ఇచ్చాడు. అయితే.. తాను రూ.15లక్షలు నష్టపోయిన బాధితుడు బాలకృష్ణ .. ఈ విషయంపై ఉన్నతాధికారులను సంప్రదించాడు.
రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి... సీఐ పని చేస్తున్న స్టేషన్ లోనే కేసు నమోదు చేయించారు. కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు ఇచ్చారు. సీఐతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదైంది.
విషయంలో బయటపడటంతో సదరు సీఐ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు.
