ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్‌లో.. మేకతోటి సుచరిత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే నేడు విజయవాడలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలకు ఆమె హాజరు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే ఆమె నేడు విజయవాడలో మహిళ దినోత్సవం సభకు హాజరుకాలేదు. అయితే హోం మంత్రి సుచరిత అనారోగ్యానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో సీఎం జగన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
