ఏపీ ప్రభుత్వ విప్ లుగా మరో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. సామినేని ఉదయభాను( జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కాపు రామ చంద్రారెడ్డి ( రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్ లుగా సీఎం జగన్ అవకాశం కల్పించారు.

అంతకు ముందుచీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి ముత్యాలనాయుడు(మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి(చంద్రగిరి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు)విప్‌లుగా నియమితులైన విషయం తెలిసిందే.  కాగా కొలుసు పార్థసారధిని విప్‌ బాధ్యతల నుంచి తొలగించారు.