Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కి జగన్ కౌంటర్: కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై సుప్రీంలో ఏపీ పిటిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.కృష్ణా జలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది.

Andhra pradesh government files petition in Supreme court against on Krishna row lns
Author
Guntur, First Published Jul 14, 2021, 11:35 AM IST


అమరావతి: కృష్ణాజలాలు, రాయలసీమ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడికాలువల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు ప్రాజెక్టులను  తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలు,  ట్రిబ్యునల్స్ ఆదేశాలను కచ్చితంగా అమలయ్యేలా చూడాలని  కోరాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

 

 

 

విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ఆ పిటిషన్ లో  ఆరోపించింది. తమ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాను కూడ తెలంగాణ సర్కార్ గండికొడుతుందని ఏపీ  ప్రభుత్వం  ఆ పిటిషన్ లో తెలిపింది. రాజ్యాంగవిరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని   ఆ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన  జోవోను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. 

 బచావత్ అవార్డు ప్రకారంగా వ్యవసాయం తర్వాత తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను కోర్టు దృష్టికి తీసుకురానుంది ఏపీ సర్కార్. మరో వైపు వ్యవసాయ అవసరాల తర్వాత తాగు నీటి అవసరాలు తీర్చకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయవద్దని  సుప్రీంను  ఏపీ సర్కార్ కోరుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios