Asianet News TeluguAsianet News Telugu

భార్యతో మోపెడ్‌పై పోలింగ్ కేంద్రానికి: మాజీ మంత్రి వీడియో వైరల్

ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి సామాన్యుడిగా తన భార్యతో కలిసి మోపెడ్‌పై  పోలింగ్ కేంద్రానికి వెళ్లి  ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Andhra pradesh former minister Raghuveera Reddy casted vote his own village lns
Author
Anantapur, First Published Feb 22, 2021, 9:17 PM IST

అనంతపురం: ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి సామాన్యుడిగా తన భార్యతో కలిసి మోపెడ్‌పై  పోలింగ్ కేంద్రానికి వెళ్లి  ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనంతపురం జిల్లాకు చెందిన ఎన్. రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పనిచేశాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా కూడ పనిచేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన స్వగ్రామంలోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతున్నాడు.సాధారణ రైతు జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు.

ఈ నెల 21వ తేదీన  అనంతపురం జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని గంగులవానిపాలెంలో పంచాయితీ ఎన్నికల్లో  ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన భార్య సునీతతో కలిసి మోపెడ్ పై వచ్చారు.

పంచె కట్టుకొని గడ్డం పెంచుకొని  పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన గ్రామస్తులతో ముచ్చటిస్తూ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత ఓటు వినియోగించుకొన్న తర్వాత ఆయన గ్రామస్థులతో ఫోటో దిగారు.ఈ  వీడియోను ట్విట్టర్  లో పోస్టు చేశాడు.

రఘువీరారెడ్డి 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో మడకశిర నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాననసభ్యుడిగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో తొలిసారి పశు సంవర్థక శాఖా మంత్రిగా పనిచేశారు. 

 

1994 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 లో మరోసారి గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 

రాజశేఖరరెడ్డి మృతి తర్వాత కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా రెవిన్యూ శాఖా మంత్రిగా కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన నేపథ్యంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్‌కు పీసీసీ చీఫ్‌ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆయన స్థానంలో మరోనేతను ఎన్నుకున్న అనంతరం పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios