Asianet News TeluguAsianet News Telugu

బావతో పెళ్లి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగంలో Constable గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. 

Andhra Pradesh : Female constable dies in suspicious circumstances in Machilipatnam
Author
Hyderabad, First Published Nov 6, 2021, 2:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీద మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 

ఏం జరిగిందో తెలియదు, సంతోషంగా పెళ్లి పీటలెక్కాల్సిన యువతి.. ఉరి తాడుకు వేలాడింది. పెళ్లి ఇష్టం లేదా? బావతో సంబంధం నచ్చలేదా? తెలియదు. ఇష్టం లేకపోతే చెప్పుకోలేని స్థితిలో కూడా లేదు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆమె తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పొచ్చు. కానీ ఆమె ఆ పని చేయలేదు. మూగగా నిండు ప్రాణాల్ని తీసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగంలో Constable గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. 

దీనికోసం పరాసుపేటలోని ఓ స్కూల్ లో పని చేసే తన బావ రాజేష్ తో ఇటీవల ఆమెకు marriage చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే ఏమైందో తెలియదు కానీ... ఈ క్రమంలో గురువారం ప్రశాంతి రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మాసూంభాషా, చిలకలపూడి సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు Suspicious deathగా కేసు నమోదు చేసిన మచిలీపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ పోరుబాట.. నవంబర్ 9న ధర్నాలు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్..

పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఏఆర్ విభాగం అధికారులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. పెళ్లి అనుకోగానే ఉరివేసుకుని suicide చేసుకోవడం అందర్నీ విషాదంలో నింపింది.

కొత్తకారుతో ఇంటికి.. అంతలోనే....
తిరుపతిలో కారు బీభత్సం సృష్టించింది. స్థానిక sk fast food వద్ద కారు అదుపుతప్పి పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు బీభత్సంతో ఏం జరుగుతుందో తెలియక జనం పరుగులు తీశారు. 

కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహదిగా తెలుస్తోంది. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు, ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios