అమరావతి: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరోనా నేపథ్యంలో  టెన్త్ తో పాటు ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులంతా పాస్ అయినట్టుగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మార్చిలో  పరీక్ష రాసేందుకు ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయినట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా 44 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ నుండి రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని  రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. స్కూల్స్ ను ఈ నెల 5వ తేదీన ప్రారంభించనున్నారు. అదే రోజున జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:ప్రవేశ పరీక్షలు: ఈ నెల 23 లోపుగా కౌంటర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

మరోవైపు మాల్‌ప్రాక్టీస్ కింది బుక్కైన 66 మందిని కూడ పాస్ చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం నుండి మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ విద్యాశాఖాధికారులు తెలిపారు. 

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిర్వహించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో స్కూల్స్ తెరిచే విషయంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ ఈ నెల 25వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే.