Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: ఢిల్లీని వెనక్కి నెట్టి కేసుల్లో 3వ స్థానం

కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్న ఢిల్లీని వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కేసులు 1,40,933కి చేరుకున్నాయి. వీటిలో 1,349 మరణాలు కూడా ఉన్నాయి. 

Andhra Pradesh Crosses Delhi To Become Third Worst COVID-Hit State
Author
New Delhi, First Published Aug 1, 2020, 8:40 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. గత మూడు రోజులుగా దాదాపుగా 30 వేల కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్న ఢిల్లీని వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కేసులు 1,40,933కి చేరుకున్నాయి. వీటిలో 1,349 మరణాలు కూడా ఉన్నాయి. 

ఒక్క శుక్రవారం నాదే 10,376 కేసులు నమోదవగా 60 మంది మరణించారు. ఢిల్లీలో శుక్రవారం నాడు 1,195 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య1,35,598కి చేరుకున్నాయి. తొలి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు కొనసాగుతున్నాయి. 

తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఈ రెండు జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేయేసికి పైగా రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 1387 కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 1124 కేసులు రికార్డయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20,395కి చేరుకుంది.

ఏపీలో గత 24 గంటల్లో 10376 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 64 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఆస్పత్రుల నుంచి 60,969 మంది డిశ్చార్జీ కాగా, 75,720 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 40 వేల 933కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 1349కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో చిత్తూర జిల్లాలో 789, తూర్పు గోదావరి జిల్లాలో 1215, గుంటూరు జిల్లాలో 906, కడప జిల్లాలో 646, కృష్ణా జిల్లాలో 313, నెల్లూరు జిల్లాలో 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, ప్రకాశం జిల్లాలో 406, శ్రీకాకుళం జిల్లాలో 402, విశాఖపట్నం జిల్లాలో 983, విజయనగరం జిల్లాలో 388, పశ్చిమ గోదావరి జిల్లాలో 956 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10376కు చేరుకుంది.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో 13 మంది, అనంతపురం జిల్లాలో 9 మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరిలో ఇద్దరు మరణించారు. కడప, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios