ఒకే చోట కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు: కొత్త జిల్లాలపై అధికారులకు జగన్ దిశా నిర్ధేశం

 కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలన్నీ ఒకే భవన సముదాయంలో ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇవాళ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Andhra Pradesh  CM YS Jagan Mohan Reddy reviews creation of new districts

అమరావతి: సుస్థిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్ధేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అను సంధానం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. బుధవారం నాడు సీఎం YS Jagan  కొత్త జిల్లాలపై సమీక్ష నిర్వహించారు.. పది కాలాలు గుర్తుండేలా  కొత్త జిల్లాల భవనాల నిర్మాణం చేయాలని ఆయన కోరారు. 

New Districts భవన నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తి చేయాలని CM  ఆదేశించారు. కొత్ కలెక్టరేట్ల నిర్మాణం కోసం కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకొన్న జిల్లాల్లో కొత్త భవనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు ఒకే భవనంలో ఉండాలని సీఎం సూచించారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల 600 సలహాలు, సూచనలు వచ్చాయన్నారు.  వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల్లో సిబ్బంది, ఉద్యోగుల పోస్టింగ్ విషయమై సిక్స్ పాయింట్స్, రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా పాటించినట్టుగా సీఎంకు అధికారులు వివరించారు.

ఈ ఏడాది జనవరి 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ అధికారులకు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారు. ఏప్రిల్ 4 నుండి కొత్త జిల్లాల నుండి పాలన అమలు కానుంది.

ఈ ఏడాది జనవరి 26న విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 90 శాతం మేరకు కొత్త జిల్లాలు ఉండనున్నాయి. ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు కొన్ని జిల్లాలకు  సంబంధించి మార్పులు చేర్పులు చోటు చేసకొనే అవకాశం ఉంది. ఈ విషయమై ఇవాళ సమీక్షలో సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ సూచనల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల కానుంది.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై కూడా అధికార పార్టీకి చెందిన  ప్రజా ప్రతినిధులకు కొన్ని అభ్యంతరాలున్నాయి.ఈ విషయాన్ని మీడియా వేదికగా కూడా వ్యక్తం చేశారు. ఈ విషయాలను కూడా సీఎం పరిశీలించే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ప్రతిపాదించిన అంశాలపై కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి..

ఉగాది నుండి ఏపీ లో కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభించాలని జగన్ సర్కార్ భావించింది. అయితే ముహుర్తాలను చూసుకొన్న తర్వాత ఉగాది కంటే ఏప్రిల్ 4వ తేదీన ముహుర్త బలం బాగుందని వేద పండితులు సూచించడంతో ఏప్రిల్ 4న  కొత్త జిల్లాల నుండి పాలన ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 గంటల నుండి 9:45 గంటల మధ్య కొత్త జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ప్రజల నుండి వచ్చిన వినతులు, సలహాలు, అభిప్రాయాలు సూచనలపై కూడా సీఎం జగన్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త జిల్లాల విషయమై కొన్ని జిల్లాల్లో ఆందోళనలు సాగుతన్నాయి.ఈ విషయమై జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటారనేది చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios