వాళ్లే కరోనా వ్యాధితో మరణిస్తున్నారు: వైఎస్ జగన్ ప్రకటన

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లే కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఆయన కోరనావైరస్ మీద సమీక్ష నిర్వహించారు.

Andhra Pradesh CM YS Jagan comments on Coronavirus deaths

అమరావతి: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లే కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ల వల్ల కరోనా ప్రభావవం రాష్ట్రంలో తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వైరస్ మీద ఆయన శనివారం సమీక్ష జరిపారు. 

రాష్ట్రంలోకి అనుమతి లేకుండా 700 మంది కూలీలు వచ్చినట్లు జగన్ తెలిపారు. రోగులకు మంచి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. టెలీ మెడిసిన్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు .కాల్ చేసిన రోగులకు మందులు అందిస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రాంతంలో పశువులకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.  
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో మరో ముగ్గురు కోవిడ్ -19 బారిన పడి మరణించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు మరణించారు. దీంతో కరోనా వైరస్ మరమాల సంఖ్య 44కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 15 మంది మరణించగా, కృష్ణా జిల్లాలో 13 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 8 మంది మృత్యువాత పడ్డారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1930కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో కోరనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో 16 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసులేమీ లేని చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 3 కేసులు, గుంటూరు జిల్లాలో 2 కేసులు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లాలో 6 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదు. కర్నూలు జిల్లా 553 కేసులతో ఎప్పటిలాగే అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 376 కేసులతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 338 కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 102
చిత్తూరు 96
తూర్పు గోదావరి 46
గుంటూరు 376
కడప 96
కృష్ణా 338
కర్నూలు 553
నెల్లూరు 96
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 62
విజయనగరం 4
పశ్చిమ గోదావరి 68

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios