అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు ఉదయం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.వైఎస్సార్ ఆసరా పథకం పై చర్చించనున్న క్యాబినెట్ లో చర్చించనున్నారు. 

నవరత్నాల్లో మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో 27 వేల కోట్ల కు పైగా ఆసరా ద్వారా లబ్ది చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి ఆమోదముద్ర వేయనుంది కేబినెట్. గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితులపై  మంత్రివర్గం చర్చించనుంది. సాధారణంగా వరద సమయాల్లో ఇచ్చే సహాయంతో పాటు అదనంగా రూ. 2 వేలు చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

కొత్తగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు పై కేబినెట్ లో చర్చించనున్ననారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ పంటల పరిస్థితి పై చర్చిస్తారు. డిసెంబర్ నుండి నాణ్యమైన బియ్యం పంపిణీ, వైఎస్సార్ భీమా పథకాలపై కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 

సెప్టెంబర్ 5వ తేదీ నుండి రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజు నుండి విద్యార్థులకు వైఎస్ఆర్ విద్యా కానుకను ఇవ్వనున్నారు. ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం పై చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అమరావతి భూముల కుంభకోణం.  కోర్ట్ వ్యవహారాల పై కూడ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వరదలపై కూడ చర్చించనున్నారు.