ఏపీ అసెంబ్లీ  సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  పొట్రెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభ్యులతో  ప్రమాణం చేయిస్తారు. ఇక గురువారం స్పీకర్, డిప్యుటీ స్పీకర్ ల ఎంపిక ఉంటుంది. మూడు రోజు గవర్నర్.. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా... బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని... ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని చీఫ్ విప్ గడికోడి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలను చాలా హుందాగా నిర్వహిస్తామని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలకు కనీసం ఛాంబర్ కూడా ఇవ్వకుండా అవమానించిందని ఆరోపించారు. 

తాము మాత్రం అందరికీ సమాన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చేలా తొలి కేభినేట్ లో నిర్ణయాలు తీసుకోవడం జగన్  గొప్పతనమని.. అందుకు తమకు గర్వంగా ఉందని చెప్పారు.