2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రవేశపెట్టారు.

సోదరుడి ఆకస్మిక మరణంతో  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక పోవడంతో.. సీఎం ఆదేశాల మేరకు బొత్స వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం.. అనుబంధ రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

బొత్స ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* వ్యవసాయ సహకార రంగానికి రూ. 234 కోట్లు
* ఆయిల్ ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ. 80 కోట్లు
* ఆయిల్ ఫాం తోటల సాగు ప్రోత్సాహానికి రూ. 65.15 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం
* రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 4,525 కోట్లు
* 50 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు
* వ్యవసాయ సహకార రంగానికి రూ. 234 కోట్లు
* సహకార రంగ అభివృద్ధికి రెవెన్యూ వ్యయం రూ. 174.64 కోట్లు
* సహకార రంగం అభివృద్ధికి పెట్టుబడి వ్యయం కింద రూ. 60 కోట్లు కేటాయింపు
* 2019-20 లో రైతులకు స్వల్పకాలిక రుణాల కింద రూ. 12 వేల కోట్లు
* దీర్ఘ కాలిక రుణాల కింద రూ. 1500 కోట్లు
* కౌలు రైతులకు రూ. 1,200 కోట్లు

* గొర్రెల బీమా పథకం కింద గొర్రె మరణిస్తే రూ. 6 వేలు
* పశువు మరణిస్తే బీమా పథకం ద్వారా రూ. 30 వేలు
* పశుగ్రాసం కోసం రూ. 100 కోట్లు
* పశు సంవర్థక శాఖకు రూ. 1,778 కోట్లు
* పాడి పరిశ్రమకు రూ. 100 కోట్లు
* పశు టీకాల కోసం రూ. 25 కోట్లు
* కోళ్ల పరిశ్రమల నిర్వాహకుల రుణాల కోసం రూ. 50 కోట్లు
* నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి రూ. 10 వేలకు పెంపు
* వేటకు వెళ్లిన మత్స్యకారులు చనిపోతే కుటుంబానికి రూ. 10 లక్షలు
* ఉప్పాడ, జువ్వలదిన్నె, వాడరేవు, నిజాంపట్నంలలో ఫిషింగ్ జెట్టీల ఏర్పాటు
* ఫిషింగ్ హార్బర్‌ల కోసం రూ. 1,758 కోట్లు
* మత్స్యశాఖ అభివృద్ధికి రూ.550 కోట్లు
* ఈ ఏడాది 12 ఈనాం మార్కెట్ల ఏర్పాటు
* 10 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న గిడ్డంగుల నిర్మాణం
* 100 రైతు బజార్లు ఏర్పాటు
* వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ. 3,223 కోట్లు

* రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రణాళిక
* ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి రూ. 200 కోట్లు
* బిందు, తుంపర సేద్య పరికరాలకు రూ. 1,105 కోట్లు
* పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు
* పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ. 158 కోట్లు

* రైతులకు వడ్డీలేని పంట రుణాలు
* ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ. 475 కోట్లు
* ఉచిత బోర్లకు రూ. 200 కోట్లు
* విత్తనాల పంపిణీకి రూ. 200 కోట్లు
*  ఆహార భద్రత మిషన్‌కు రూ. 141 కోట్లు
* వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 349 కోట్లు
* రైతులకు రాయితీ విత్తనాలకు రూ. 200 కోట్లు
* పరీక్షల తర్వాతే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సరఫరా
* భూసార పరీక్ష నిర్వహణకు రూ. 30 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 420 కోట్లు   
* పొలం పిలుస్తోంది.. పొలం బడికి రూ. 89 కోట్లు
* జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ. 91 కోట్లు
* ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 29 కోట్లు
* 81 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగు లక్ష్యం

* రూ. 28,866 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
* రైతులకు పెట్టుబడి సాయం రూ. 8,750 కోట్లు
* అక్టోబర్ నుంచి పెట్టుబడి సాయం అందజేత
* వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1,163 కోట్లు
* రైతులకు పెట్టుబడి సాయం కింద రూ. 12,500
* వైఎస్సార్ రైతు బీమాకు రూ. 100 కోట్లు
* ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షల సాయం
* ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
* విపత్తు నిర్వహణ నిధికి రూ. 2002 కోట్లు
* అగ్రికల్చర్ మిషన్ వీటి నిర్వహణను చూసుకుంటుంది