ఏపీ రాష్ట్రంలో ఏసీబీ భారీ ఆపరేషన్‌కు సన్నద్దమౌతున్నట్టుగా సంకేతాలు ఇస్తోంది ఇంటలిజెన్స్ చీఫ్ నుండి ఏసీబీ డీజీ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ భారీ ఆపరేషన్‌కు రంగం సిద్దమైనట్టుగా ప్రచారం సాగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో ఏసీబీ భారీ ఆపరేషన్‌కు సన్నద్దమౌతున్నట్టుగా సంకేతాలు ఇస్తోంది ఇంటలిజెన్స్ చీఫ్ నుండి ఏసీబీ డీజీ గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ భారీ ఆపరేషన్‌కు రంగం సిద్దమైనట్టుగా ప్రచారం సాగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఎన్నికలకు ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వరరావును ఇంటలిజెన్స్ నుండి తప్పించారు. ఆ తర్వాతే ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా ఏపీ సర్కార్ నియమించింది.
ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్షలు నిర్వహించారు.ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడ ఏసీబీ పరిధిలోకి వస్తారని ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ నేతలు, అధికారుల్లో భయానికి కారణంగా మారింది.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది మే 23వ తేదీన రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీ రాష్ట్రంలో ఏసీబీ భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
పెండింగ్‌లో ఉన్న ఏసీబీ కేసులు , ఏ కేసులు పురోగతిలో ఉన్నాయనే విషయమై ఏబీ వెంకటేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు. అసమాన ఆస్తులు కలిగి ఉన్న కేసుల విషయంలో అరెస్టైన వారెందరు, నిందితులుగా ఉన్న వారికి రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలు తదితర వ్యవహారాలపై ఆయన కేంద్రీకరించినట్టు సమాచారం.
అయితే కొన్ని పార్టీల నేతలతో పాటు కొందరు అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేంద్రీకరించినట్టు ప్రచారం సాగుతోంది.అక్రమాస్తులు కలిగి ఉన్న వారిని అరెస్ట్ చేసే అధికారం ఉంది. భవిష్యత్తులో భారీ ఆపరేషన్ జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఏసీబీ అధికారులు ఇంటలిజెన్స్ అధికారులతో టచ్‌లో ఉండేవారు.కానీ ఐదు రోజుల క్రితం ఏసీబీ చీఫ్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.ఏపీ రాష్ట్రంలో సీబీఐ దాడులకు సహకరించబోమని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం ఏసీబీని మరింత బలోపేతం చేసినట్టుగా ఉందనే ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని వైసీపీకి చెందిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు ప్రభుత్వ స్కానింగ్ కింద ఉంటారని మిధున్ రెడ్డి చెప్పారు.
ఏసీబీ చీఫ్ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు బెదిరించినట్టుగానే ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఏపీ రాష్ట్రంలోని విపక్ష పార్టీలపై తప్పుడు కేసులను బనాయించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రంలో ఏ ఐపీఎస్ అధికారులు కూడ ఈ రకంగా బెదిరింపులకు పాల్పడలేదన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 28, 2019, 12:11 PM IST