హైదరాబాద్:  కర్నూల్ జిల్లా పోలీసులు  ఆదివారం నాడు  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడికి నోటీసులు ఇవ్వనున్నారు. కరోనా ఎన్ 440-కే వేరియంట్  ఉందని తప్పుడు ప్రచారం చేసి తమను భయబ్రాంతులకు గురి చేశారని  కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం  సుబ్బయ్య కర్నూల్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై చంద్రబాబునాయుడికి  41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద  పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. 

also read:చంద్రబాబుకు హైదరాబాదులో రేపు నోటీసులు ఇస్తాం: కర్నూలు ఎస్పీ ఫకీరప్ప

also red:షాక్: కర్నూల్‌లో టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై క్రిమినల్ కేసు

 కర్నూల్ వన్ టౌన్ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి ఆదివారం నాడు ఉదయం కర్నూల్ నుండి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ కు చేరుకొని  చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనున్నారు. వారం రోజుల్లో చంద్రబాబునాయుడు ఈ విషమయై పోలీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎలాంటి కొత్త కరోనా వైరస్ వేరియంట్ లేదని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం కారణంగా ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అడుగుపెట్టాలంటే 14 రోజుల పాటు  క్వారంటైన్ లో ఉండాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ నేతలు  విమర్శిస్తున్నారు.