అనపర్తి లో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి గెలుపు
Anaparthy assembly elections result 2024 live : తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సత్తి సూర్యనారాయణరెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వైసిపి నుండి మొదటిసారి పోటీచేసి విజయం సాధించారు. అంతకుముందు టిడిపి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేసారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తిలో బీజేపీ విజయం సాధించింది. 20,567 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి విజయం సాధించారు.
Anaparthy assembly elections result 2024 live : అనపర్తి రాజకీయాలు :
అనపర్తి రాజకీయాల్లో నల్లమిల్లి కుటుంబానిదే పైచేయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుండి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం ఆ పార్టీలో కొనసాగుతోంది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కూడా 1985,1994,1999 ఎన్నికల్లోనూ మూలారెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేసారు మూలారెడ్డి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
టిడిపి కంచుకోట అనపర్తిలో 2019 లో వైసిపి జెండా ఎగిరింది. రాజకీయ పలుకుబడి కలిగిన నల్లమిల్లి కుటుంబాన్ని ఎదుర్కొని సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసిపిని గెలిపించారు. ప్రస్తుతం ఆయన అనపర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అనపర్తి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. పెదపూడి
2. బిక్కవోలు
3. రంగంపేట
4. అనపర్తి
అనపర్తి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,13,511
పురుషులు - 1,05,246
మహిళలు - 1,08,259
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
వైసిపిలో రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని వైసిపి బరిలోకి దింపింది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మరోసారి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే అనపర్తి బరిలో దింపింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా రామకృష్ణారెడ్డిపైనే టిడిపి అదిష్టానం నమ్మకం ఉంచి బరిలోకి దింపింది.
అనపర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
అనపర్తి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,86,745
వైసిపి - డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి - 1,11,771 (59 శాతం) - 55,207 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
టిడిపి - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - 56,564 (30 శాతం) - ఓటమి
అనపర్తి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,74,274 (85 శాతం)
టిడిపి - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి - 83,398 (47 శాతం) - 1,373 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - సత్తి సూర్యనారాయణ రెడ్డి - 82,025 (47 శాతం) - ఓటమి
అనపర్తి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తిలో బీజేపీ విజయం సాధించింది. 20,567 ఓట్లతో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి విజయం సాధించారు.
- Anaparthy Politics
- Anaparthy assembly elections result 2024
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Elections 2024
- JSP
- Janasena Party
- Nallamilli Ramakrishnareddy
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- Satti Suryanarayana Reddy
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP