అనంతపురంలో జనసేన నేత నాగబాబు టూర్ : శ్రమదానానికి అనుమతి లేదన్న పోలీసులు, నోటీసులు

అనంతపురంలో  తన పర్యటనను రద్దు చేసుకోవాలని జనసేన నేత నాగబాబును  పోలీసులు కోరుతున్నారు.  నగరంలో  కానిస్టేబుల్ పరీక్షలు రాసే అభ్యర్ధులు ఇబ్బంది పడే అవకాశం ఉందని  చెబుతున్నారు.  ఈ విషయమై  పోలీసులు జనసేన నేతలకు నోటీసులు జారీ చేశారు. 

Anantapur Police Serve Notices To Janasena Leaders

అనంతపురం: అనంతపురంలో  కలెక్టర్ కార్యాలయం ముందు  రోడ్లపై  గుంతలు పూడ్చే కార్యక్రమానికి  అనుమతి లేదని  పోలీసులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పోలీసులు  జనసేన నేతలకు ఆదివారం నాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

రోడ్లపై  గుంతలు పూడ్చాలని  జనసేన  నేతలు  ఆదివారం నాడు   శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు.  అయితే  కలెక్టర్  కార్యాలయంతో పాటు  చెరువు కట్టపై  శ్రమదానంతో  రోడ్లకు మరమ్మత్తులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అనంతపురంలో  నాగబాబు  పర్యటనను పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం ముందు  గుంతలను  అధికారులు పూడ్చారు.   జనసేన చేపట్టదల్చిన శ్రమదాన కార్యక్రమానినిక అనుమతి లేదని  పోలీసులు ప్రకటించారు. నాగబాబు సహ  జనసేన నేతలు  శ్రమదానం చేయకూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు  జనసేన నేతలకు  పోలీసులు నోటీసులు అందించారు. 

హైద్రాబద్ నుండి  అనంతపురం పట్టణానికి జనసేన నేత నాగబాబు  చేరుకున్నారు.  నాగబాబు  బస చేసిన హోటల్ వద్దకు  జనసేన నేతలు  భారీగా  చేరకున్నారు.తాము నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు  చెరువు కట్ట, కలెక్టర్ కార్యాలయం వద్దకు  కనీసం నాలుగు కార్లను అనుమతిస్తే  శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జనసేన నేతలు చెబుతున్నారు.
 
ఏపీ రాష్ట్రంలో  ఇవాళ కానిస్టేబల్  ప్రిలిమినరీ పరీక్షలు ఉన్నాయి.  నాగబాబు  శ్రమదాన కార్యక్రమానికి  బయటికి వస్తే రోడ్లపై  ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని  పోలీసులు  చెబుతున్నారు.  పరీక్షలకు  హాజరయ్యే  అభ్యర్ధులు ఇబ్బందిపడే అవకాశం ఉందని పోలీసులు   చెబుతున్నారు.  దీంతో  తన పర్యటనను రద్దు  చేసుకోవాలని నాగబాబును  పోలీసులు కోరుతున్నారు.  తాము రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, సభలు నిర్వహించడం లేదని జనసేన నేతలు చెబుతున్నారు.  తమ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని  ప్రకటించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios