Asianet News TeluguAsianet News Telugu

కరోనా : ‘అందుకే ఆయుర్వేద మందు పంపిణీ ఆపాం’... బొగని ఆనందయ్య..

నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొగని ఆనందయ్య కరోనా మందు పంపిణీ వారం పాటు నిలిపివేశారు. దీనికి కారణం ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు.

ananda an explanation why they stopped ayurvedic medicine distribution for corona - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 9:32 AM IST

నెల్లూరు జిల్లా, క్రిష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బొగని ఆనందయ్య కరోనా మందు పంపిణీ వారం పాటు నిలిపివేశారు. దీనికి కారణం ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు.

అయితే తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ నిలిపివేశామని ఆనందయ్య చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్థాలు సేకరించడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుందని అన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దీనిమీద ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ.. ‘ఆనందయ్య వంశ పారంపర్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. కోవిడ్ నివారణకు కూడా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఈ మందు అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. 

అందుకే ప్రజలు వెల్లువెత్తారు. కాకాపోతే వారి తొందరలో భౌతిక దూరం పాటించే అంశాన్ని మరిచిపోయారు. ఈ భౌతిక దూరం పాటించని అంశాన్ని లోకాయుక్త సుమోటోగా విచారణకు స్వీకరించింది. 

పోలీసుల సంరక్షణలో ఆనందయ్య: పది రోజుల పాటు కరోనా మందుకు బ్రేక్...

కరోనాతో ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిన వారికి కూడా కంట్లో డ్రాప్స్ వేయడం వల్ల మంచి ఫలితాలను ఇచ్చింది. అందుకే మందు పంపిణీ ప్రారంభించాం అన్నారు. అయితే జనాల రద్దీ కారణంగా పంపిణీ సరిగా సాగలేదు.

అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీని మీద సమీక్ష చేశారు. ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవ్వాళ వస్తుంది. ఐసీఎంఆర్ బృందం కూడా నెల్లూరు రానుంది. నివేదిక వచ్చిన తరువాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ రావద్దు. ఆన్ లైన్ సర్వీసు కూడా చేపట్టాలని అనుకుంటున్నాం’ అని ఎమ్మెల్యే కాకాని అన్నారు. 

రద్దీ కారణంగా పంపిణీ సవ్యంగా సాగలేదు. సీఎం జగన్ కూడా దీనిపై సమీక్ష చేశారు. ఆయుష్ అధికారుల రిపోర్ట్ కూడా ఇవాళ వస్తుంది. ఐసీఎంఆర్‌ బృందం కూడా నెల్లూరు రానుంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రజలందరికీ పంపిణీ చేస్తాం. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరూ రావద్దు. ఆన్‌లైన్‌లో సర్వీస్ కూడా చేపట్టాలని అనుకుంటున్నా౦’’.

Follow Us:
Download App:
  • android
  • ios