కృష్ణాజిల్లా, తిరువూరులో మానవత్వం మంట గలిసింది. కరోనా తో మృతి చెందిన వ్యక్తి ని రోడ్డు మీద వదిలి వేసి వెళ్లిపోయారు. తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామానికి షేక్ సుభాని గత రెండు రోజుల నుండి జ్వరంత భాదపడుతున్నాడు.

"

మంగళవారం రాజు గూడెం పీహెచ్సీ లో కరోనా టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అక్కడ నుండి తిరువూరు లోని కోవిడ్ హాస్పిటల్ కు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి తీసుకువచ్చారు.

అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం బందువులకు చెప్పారు. బంధువులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. 

అంబులెన్స్ వచ్చి మృతదేహాన్ని తీసుకొని వారి గ్రామానికి బయలుదేరింది. అయితే అంబులెన్స్ డ్రైవర్ నేరుగా గ్రామంలోకి  వెళ్ళకుండా గ్రామ శివారులోనే మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 

మృతదేహం అలా రెండు గంటలుగా రోడ్డు పైనే అనాథలా పడిఉంది. ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, దగ్గర ఉండి దహానసంస్కారాలకు కావలసిన ఏర్పాటు చేశారు.

ఈ అంతిమయాత్రలో తిరువూరు సిఐ యం శేఖర్ బాబు, ఎస్సై సుబ్రహ్మణ్యం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.