ప్రముఖ క్రికెట్ ఆటగాడు అంబటి రాయుడు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ వాలంటీర్లకు అండగా నిలిచారు. కొందరు బురద జల్లుతూనే ఉంటారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

అమరావతి: ప్రముఖ క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛంద సేవలందిస్తున్న వాలంటీర్లపై ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. వాలంటీర్లకు మద్దతు ప్రకటించారు. కొందరు బురద జల్లుతూనే ఉంటారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. వాలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడం తప్పని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తున్నదని అంబటి రాయుడు కొనియాడారు. ఈ వ్యవస్థ ఏపీ రాష్ట్రానికి ఒక ఫ్లాగ్ షిప్ వంటిదని వివరించారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరగనిది మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదని పేర్కొన్నారు.

Also Read: మాజీ భార్యతో ప్రస్తుత భార్యకు ఫ్రెండ్షిప్.. ఇద్దరు కలిసి భర్తను చంపేశారు!

వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేదే ఒక గొప్ప ఆలోచన అని అంబటి రాయుడు అన్నారు. దీని ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదని వివరించారు. ఇలాంటి సేవలందించే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. కరోనా ఆపత్కాలంలోనూ వాలంటీర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించారని, దీన్ని ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని అన్నారు.