తుది అంకానికి అమరావతి జేఏసీ పాదయాత్ర: 17న తిరుపతిలో సభకు ప్లాన్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతుల మహా పాదయాత్ర తిరుపతిలో మంగళవారం నాడు ముగియనుంది. ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
తిరుపతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర చివరి అంకానికి చేరుకొంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని Amaravati Jac ఈ ఏడాది నవంబర్ 1న పాదయాత్రను చేపట్టారు. ఇవాళ Tirupati లో పాదయాత్ర ముగియనుంది. ఇవాళ, రేపు రైతులు Tirumala శ్రీవారిని దర్శించుకొంటారు.
ఈ నెల 17న పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని తిరుపతిలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని అమరావతి జేఏసీ Ap High court లో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతితో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. పలు జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతూ తిరుపతికి చేరుకొంది. సుమారు 500 కి.మీ పాదయాత్ర సాగింది.
మూడు రాజధానులే ముద్దంటూ ప్లెక్సీలు.. చించేసిన అమరావతి జేఏసీ
తిరుపతిలో మూడు రాజధానులే ముద్దంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను అమరావతి జేఏసీ ప్రతినిధులు చించేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల కావాలనుకొనే వారు ధైర్యంగా బయటకు రావాలని అమరావతి జేఏసీ కోరింది.