Asianet News TeluguAsianet News Telugu

జనసేన ఎప్పుడూ అమరావతి రైతుల పక్షమే: నాదెండ్ల మనోహర్

మంగళవారం రాజధాని ప్రాంత రైతులతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.

amaravati farmers meet janasena chief pawan kalyan ksp
Author
Amaravathi, First Published Nov 17, 2020, 5:32 PM IST

మంగళవారం రాజధాని ప్రాంత రైతులతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.

అమరావతి రైతులకు పవన్ ఎప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. అలాగే జనసేన తరపున నాయకుల్ని కూడా రైతుల పక్షాన పంపారని నాదెండ్ల తెలిపారు. గత కొద్దినెలల నుంచి కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఎవరూ హర్షించరని మనోహర్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యల గురించి నిరసన తెలియజేసే అవకాశం వుందని, కానీ వైసీపీ ప్రభుత్వం దానిని అడ్డుకోవడం బాధాకరమన్నారు.

అంతకుముందు పవన్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రజలు కోల్పోయిన వాటిని అందచేయడమని అని తెలిపారు. అది జనసేన చేస్తుందని పార్టీ శ్రేణుల భేటీలో అన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన పాలకులు, అధికార పక్షంలో లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తాను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు అని అన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినా నిలబడేవారై ఉండాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios