Asianet News TeluguAsianet News Telugu

ఆర్-5 జోన్‌ ‌: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

ఆర్-5 జోన్  పై  అమరావతి రైతులు  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై  ఈ నెల  14న  సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది. 

Amaravati Farmers Filed Petition in Supreme Court over R-5 Zone lns
Author
First Published Apr 6, 2023, 2:37 PM IST | Last Updated Apr 6, 2023, 4:29 PM IST

అమరావతి:ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో అమరావతి  రైతులు గురువారంనాడు పిటిషన్  దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  ఈ నెల  14న విచారణ నిర్వహించనున్నట్టుగా  సుప్రీంకోర్టు  ధర్మాసనం తెలిపింది. 

 ఈ నెల 10న విచారణకు తీసుకోవాలని  రైతుల తరపు న్యాయవాది కోరారు.  ఈనెల10 నాటి కేసుల జాబితా ఇప్పటికే తయారైందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో  ఈ నెల  14న విచారణకు తీసుకుంటామన్న సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. 

రాష్ట్రంలోని ఎక్కడివారికైనా  అమరావతిలో  ఇళ్ల స్థలాలు  కేటాయించేందుకు వీలుగా  రాష్ట్ర ప్రభుత్వం  ఆర్-5 జోన్  ను  ఏర్పాటు  చేసింది.  అయితే  ఆర్-5 జోన్ ఏర్పాటు ను  అమరావతి రైతులు  వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయమై  ఏపీ హైకోర్టును  ఆశ్రయించారు. హైకోర్టు  ఈ విషయమై  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో  సుప్రీంకోర్టులో  ఇవాళ  పిటిషన్ దాఖలు  చేశారు  అమరావతి రైతులు .

అమరావతిలో  ఇళ్ల స్థలాలు , ఇండ్ల నిర్మాణానికి  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాట్లు  చేస్తుంది. ఈ మేరకు  టెండర్లను  పిలిచింది.  రూ. 50 కోట్ల టెండర్లను  పిలిచింది ప్రభుత్వం.  టెండర్ల దాఖలు కు ఈ నెల  15వ తేదీ చివరి తేదీ. 49 వేల మంది లబ్దిదారులకు  ఇళ్ల పట్టాలు  ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు  చేస్తుంది.దీంతో  అమరావతి రైతులు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో  తమ వద్ద నుండి తీసుకున్న భూముల విషయంలో  ప్రభుత్వం  నిబంధనలను  ఉల్లంఘించిందని  అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై  రైతులు కోర్టును ఆశ్రయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios