Asianet News TeluguAsianet News Telugu

అమరావతి జేఎసీ రౌండ్ టేబుల్: రేవంత్, కోదండరామ్‌కు ఆహ్వానం

అమరావతి జేఎసీ ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి  తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంద్ రెడ్డి, జేఎసీ చైర్మెన్ కోదండరామ్ కు ఆహ్వానం అందింది.

Amaravathi JAC invites Revanth Reddy, kodandaram for round table meeting on Feb 29
Author
Amaravathi, First Published Feb 28, 2020, 1:37 PM IST


అమరావతి: తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని  అమరావతి జేఎసీ  నిర్ణయం తీసుకొంది. ఈ నెల 29వ తేదీన  అమరావతి జేఎసీ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన నేతలను కూడ ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కూడ హాజరుకానున్నారు.

Also read:బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి మహిళల యత్నం, జేఎసీ బస్సును వెంటాడిన యువకులు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిసర గ్రామాల వాసులు   సుమారు 70 రోజులుగా ఆ:దోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని  జేఎసీ నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు పలు రాజకీయపార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన అమరావతిలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికింది  జేఎసీ. 

ఈ సమావేశానికి  తెలంగాణకు చెందిన నేతలను కూడ ఆహ్వానం పలికింది అమరావతి జేఎసీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, టీజేఎష్ చీఫ్ కోదండరామ్‌కు కూడ జేఎసీ  నుండి ఆహ్వానం అందింది. అయితే వీరిద్దరూ ఈ సమావేశానికి హాజరు అవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జేఎసీ ఛైర్మెన్ గా  కోదండరామ్ వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సాగిన ఉద్యమంలో కోదండరామ్ పాత్రను విస్మరించలేం.

ప్రస్తుతం అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆందోళన చేస్తున్న జేఎసీ భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో  కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios