తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ అల్లూరి కృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ కో ఆర్డినేటర్ అల్లూరి కృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నారు. తనతో పాటు తన అనుచరులు కూడ పార్టీలో చేరనున్నారని చెప్పారు.
జనసేనలో చేరాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నందున తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నట్టు అల్లూరి కృష్ణంరాజు ప్రకటించారు. మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటపతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటపతితో పాటు బోగోలు జడ్పీటీసీ బాపట్ల కామేశ్వరీతో పాటు మరికొందరు నేతలు కూడ వైసీపీకి రాజీనామా చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు వారు సంప్రదింపులు జరిపారని సమాచారం. టీడీపీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో వీరంతా వైసీపీకి గుడ్ బై చెప్పారని సమాచారం.
