జనసేన అధినేత పవన్ కళ్యాన్ తమ కుటుంబాన్ని మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాతంగా జీవిస్తున్న తమ కటుంబాన్ని వీధికి ఇడ్చాడని ఆమె ఆరోపించారు.  బుధవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు.

మాడుగుల టికెట్ తమ కుటుంబానికి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని.. ఆ టికెట్ టీడీపీ గెలిచేలా డమ్మీ క్యాండెట్ కి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజుకు రాజకీయాల్లో మంచి భవిష్యత్‌ ఉంటుందని, మాడుగుల సీటు ఇస్తామని ఆహ్వానించడంతోనే జనసేనలో చేరామన్నారు. 

పవన్ చెప్పారనే.. ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తన మనవడిని కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్‌ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.గవిరెడ్డి రామానాయుడుకి టీడీపీలో, గవిరెడ్డి సన్యాసినాయుడకి జనసేనలో టికెట్లు ఎలా దక్కాయని ప్రశ్నించారు.