ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్ల రూపురేఖలు మారుస్తామంటూ ప్రారంభించిన నాడు నేడు పథకం వైసిపి నేతల ఆర్థిక పరిస్థితిని మార్చిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు.
అమరావతి: నాడు నేడు పేరుతో సీఎం జగన్ రెడ్డి అనుయాయులకు కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ నిధుల్ని దోచిపెట్టారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. అంతే తప్ప ఈ నాడు నేడు వల్ల విద్యార్ధులకు, తల్లితండ్రులకు చేకూరిన ప్రయోజనం శూన్యమన్నారు. ఉన్న భవనాలకు రంగులేసి నాడు నేడు అని ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని మాజీ మంత్రి మండిపడ్డారు.
''నాడు నేడు పథకం కాంట్రాక్టర్లలంతా వైసీపీ నేతలే. తక్కువ క్యాలిటీ మెటిరీయల్ వాడి కోట్ల రూపాయిల బిల్లులను దోచుకున్నారు. ఈ పథకంతో వైసీపీ నేతల ఆర్దిక పరిస్థితులు మారాయి తప్ప స్కూళ్ల పరిస్థితులు ఏమాత్రం మారలేదు'' అన్నారు.
read more మూడు రాజధానులపై మాట్లాడని వైఎస్ జగన్: కారణం ఏమిటి?
''ఓ వైపు అవసరం ఉన్నా లేకపోయినా పేజీలకు పేజీల పత్రికా ప్రకటనలతో జగన్ అవినీతి పుత్రికకు దోచిపెడితే.. మరో వైపు బస్తాలకు బస్తాలకు అవసరం ఉన్నా లేకపోయినా భారతీ సిమెంట్స్ ను వాడుతూ జగన్ రెడ్డి కంపెనీలను లాభాల బాట పట్టించుకున్నారు. నిజానికి నాడు నేడు అనేది పాఠశాలల పేరుతో జగన్ రెడ్డి దోపిడి పథకం. పసిపిల్లలకు అందించే పుస్తకాలు, బాగ్ విషయాల్లోను అవినీతికి పాల్పడం దుర్మార్గం'' అన్నారు.
''నాడు నేడు పనుల్లో జరుగుతున్న అక్రమాలకు ఎంతో మంది ఉపాధ్యాయులు మనోవేధనకు గురి అయ్యారు. కొంత మంది ఒత్తికి తట్టుకోలేక చనిపోయారు. నాణ్యమైన విద్యలో చంద్రబాబు హాయాంలో ఏపీ 3వ స్థానం ఉంటే జగన్ రెడ్డి 19వ స్థానానికి దిగజార్చారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమం, అంగన్ వాడీల మార్పు, ప్రాథమిక పాఠశాలు ప్రశ్నార్ధకం ఇలా రకరకాల తుగ్లక్ విధానాలతో విద్యా వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారు'' అని మాజీ మంత్రి ఆలపాటి మండిపడ్డారు.
