మంత్రి భూమా అఖిలప్రియ, యువ పారిశ్రామికవేత్త మద్దూరు భార్గవరామ్‌ నాయుడుల వివాహం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం కోటకందుకూరుమెట్ట వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల వేదికగా ఈ వివాహాన్ని జరిపించారు.

 కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య వివాహాం జరిగింది. మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు వివాహానికి హాజరై నతూన వధూవరులను ఆశీర్వదించారు.