ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... మంత్రుల దగ్గర పనిచేసే అధికారుల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో.. వైఎస్ జగన్ విజయ ఢంకా మోగించి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా... అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ప్రజలకు మంచి పాలన అందించడంతోపాటు... తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షాలకు ముందుగా తెలిసిపోకుండా ఉండేందుకు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన అధికారులను... నూతన మంత్రులకు దూరంగా పెట్టాలని జగన్ భావిస్తున్నారు.

గత ప్రభుత్వంలోని మంత్రుల దగ్గర పనిచేసిన వారికి కొత్త మంత్రుల దగ్గర అవకాశం ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు. ఏపీ మంత్రుల వ్యక్తిగత సిబ్బంది నియామకాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. సిబ్బంది నియామకం విషయంలో సీఎం జగన్ అనుమతి తీసుకోవాలని మంత్రులకు ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం లేఖ రాశారు.