రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తానంటూ ఊరిస్తూ చెప్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎట్టకేలకు తన మద్దతు ప్రకటించారు. ఏపీలో తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.   

హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తానంటూ ఊరిస్తూ చెప్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎట్టకేలకు తన మద్దతు ప్రకటించారు. ఏపీలో తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సొంత రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అసదుద్దీన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కనీసం రెండు ఎంపీ స్థానాలను కూడా గెలవలేరని జోస్యం చెప్పారు. చంద్రబాబు కోట్లు ఖర్చుపెట్టి ప్రచారం చేసినా తెలంగాణలో ఫలితాలు సాధించలేకపోయారని విమర్శించారు. 

ఏపీలో తాను ప్రచారం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో త్వరలోనే చంద్రబాబుకు తెలుస్తుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తాను త్వరలోనే వస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు.