విజయవాడ : కరోనాతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ సవడం శ్రీనివాస్ మృతి చెందాడు. గత వారం రోజులుగా సవడం శ్రీనివాస్ కరోనాతో బాధపడుతున్నాడు. 

అయితే  ఇప్పటికే అగ్రిగోల్డ్ లో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వివిధ కారణాలతో ముగ్గురు డైరెక్టర్లు మృతి చెందారు. డైరెక్టర్లు ఇమ్మిడి సదా శివ వరప్రసాద్, అవ్వా ఉదయ భాస్కర్ అనే ముగ్గురు ఇదే కారణంతో మరణించారు. 

కరోనా ఎఫెక్ట్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు...

మరోవైపు కరోనా సోకితే వెలి వేస్తారన్న భయం, చూసే వాళ్లు ఉండరన్న వేదన, ఒంటరి అయిపోతామన్న ఆందోళనలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మరో విషాద ఘటనే గన్నవరం మండలం మర్లపాలెంలో చోటుచేసుకుంది. 

మర్లపాలెంకు చెందిన 74యేళ్ల హరిబాబు గత మూడ్రోజులుగా జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో చుట్టు పక్కల వాళ్లు, స్థానికులు అతనికి కరోనా వచ్చిందంటూ గొడవ గొడవ చేయడం మొదలు పెట్టారు. 

స్థానికుల ఈ మాటలు, హడావుడితో హరిబాబు బెదిరిపోయాడు. ఈ వయసులో తనకు కరోనా వచ్చి నలుగురిలో ఇబ్బందులు పడుతున్నానంటూ వేదన చెందాడు. తీవ్రమనస్తాపం చెంది కరోనా టెస్టు చేయించుకోకుండానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.