అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం లేక ఇబ్బంది పడుతున్న ఏపీ రాష్ట్రం. దీంతో రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని స్థాపించేందుకు కొన్నాళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

 పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తికేంద్రంకోసం ఒప్పందం చేసుకొంది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ ప్రారంభం కానుంది. 
పశువులకు కావాల్సిన అన్నిరకాల వ్యాక్సిన్లను తయారు చేయనున్నారు. 

గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్లరోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

 దాదాపు రూ.50 కోట్ల  ఐజీవై పెట్టుబడి పెట్టనుంది. వ్యాక్సిన్ యూనిట్ కు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోంది. ఇక్కడ పనిచేసే నిపుణులకు సిబ్బందికి ప్రభుత్వం వసతి కల్పిస్తోంది. 

ఏపీ రాష్ట్ర అవసరాలను తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి చేసేదిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఏపీ సీఎం జగన్ సమక్షంలో శుక్రవారం నాడు ఐజీవైతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది.